Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ జిమ్మిక్కులు కాస్త మానుకోండి..

ABN , First Publish Date - 2023-06-23T13:13:21+05:30 IST

బియ్యం పంపిణీపై జిమ్మిక్కులు మానుకోవాలని, ఎన్నికల పరిశీలకుడి మాటలు విని కనీసమైన జాగ్రత్తలు లేకుండానే అన్నభాగ్య పథకం ద్వారా

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ జిమ్మిక్కులు కాస్త మానుకోండి..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బియ్యం పంపిణీపై జిమ్మిక్కులు మానుకోవాలని, ఎన్నికల పరిశీలకుడి మాటలు విని కనీసమైన జాగ్రత్తలు లేకుండానే అన్నభాగ్య పథకం ద్వారా పదికేజీల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికల పరిశీలకుడినే బియ్యం అడగాలంటూ మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి(Kumaraswamy) మండిపడ్డారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతానికి కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. బియ్యం గ్యారెంటీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్ని బీపీఎల్‌ కార్డులు ఉన్నాయి. కార్డులో ఉండే ఒకరికి ఐదు కేజీలు బియ్యం పెంచితే ఎంతమేర అధనంగా అవసరమనేది ఎందుకు నిర్ధారించలేదన్నారు. మరో వారం రోజుల్లో జూలై వస్తుండగా కనీసమైన బియ్యం నిల్వ చేసుకోకుండానే పథకం ప్రారంభిస్తామని ఎలా ప్రకటిస్తారన్నారు. ఇంతకూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి ప్రకటించిన పథకానికి కేంద్రం ఎందుకు అదనంగా బియ్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేంద్రానికి దరఖాస్తు చేసుకుందా అని నిలదీశారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(Food Corporation of India)కు లేఖ రాశామని సీఎం చెప్పడం ఏమని అనుకోవాలన్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ఇలా ప్రకటనలు చేస్తారా అన్నారు. బియ్యం కావాలంటే కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖా మంత్రికి విన్నవించాలన్నారు. గృహజ్యోతి పథకం దరఖాస్తులు వేగవంతంగా సాగకుండా సర్వర్‌ డౌన్‌ చేశారంటూ మంత్రి సతీష్ జార్కిహొళి వ్యాఖ్యలను ఏమనాలని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజలు విశ్వసించేలాంటి వ్యాఖ్యలు చేయాలన్నారు.

Updated Date - 2023-06-23T13:13:23+05:30 IST