Home » JDS
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్, జేడీఎస్లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.
మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి అంటూ.. మంత్రి సతీశ్‌జార్కిహొళి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
నా రాజకీయ జీవితంలొ ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు బీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో బీజేపీ సభ్యులు సభకు భంగం కలిగించడం దారుణమన్నారు.
దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.
జేడీఎస్(JDS) పార్టీలో తనను సస్పెండ్ చేసే సత్తా ఉన్న నాయకులు లేరని ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ(MLA GT Deve Gowda) అన్నారు. బుధవారం మైసూరు(Mysoor)లో రామ్‌లల్లా విగ్రహానికి ఉపయోగించిన రాయిని వెలికితీసిన ప్రదేశంలో పూజ చేశారు.
జేడీఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఆపరేషన్ హస్త కుట్ర పన్నారని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) సంచలనమైన ఆరోపణలు చేశారు. బెంగళూరు(Bangalore)లో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు చెప్పేవి కల్లబొల్లి మాటలని, హాసన్ జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ ఏమీ లేదని, సీడీలు విడుదల చేయడమే వారి గొప్ప అని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) ఎద్దేవా చేశారు. హా
చెన్నపట్టణ(Chennapatna) ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించిందని నాకంటే నా అభిమానులు, కార్యకర్తలు మరింత నిరాశ చెందారని అలాగని కుంగిపోయేది లేదని జేడీఎస్ యువ నాయకుడు నిఖిల్(Nikhil) బహిరంగలేఖ రాశారు.
చన్నపట్టణ ఎమ్మె ల్యేగా గెలిచిన ఉత్సాహంలో సీపీ యోగేశ్వర్ మాట్లాడుతున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే శారదా పూర్యానాయక్(JDS MLA Sarada Pooryanayak) తిరగబడ్డారు. శివమొగ్గలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతనెవరు.. మమ్మల్ని కొన్నారా... ఆయనను నమ్ముకుని మేం గెలవలేదన్నారు.