Former Minister: బీజేపీలో టికెట్ల కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు వింటే...
ABN , Publish Date - Apr 02 , 2023 | 10:36 AM
బీజేపీలో ఎవరికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదని చివరకు సీఎం బొమ్మైకు కూడా ఇదే వర్తిస్తుందని మాజీ మంత్రి లక్ష్మణ సవది(Former Minister Lakshman
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీలో ఎవరికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదని చివరకు సీఎం బొమ్మైకు కూడా ఇదే వర్తిస్తుందని మాజీ మంత్రి లక్ష్మణ సవది(Former Minister Lakshmana Savadi) తేల్చి చెప్పారు. శనివారం గదగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం బొమ్మై, మాజీ మంత్రి ఈశ్వరప్ప సహా ఎవరికీ టికెట్ గ్యారంటీ అంశం అధిష్ఠానం తేల్చలేదన్నారు. నియోజకవర్గాల ఎంపిక, అభిప్రాయసేకరణ సాగుతున్నాయని రెండు రోజుల కసరత్తు బెంగళూరులో ప్రారంభమైందన్నారు. పార్టీ పదాధికారులు, ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుందన్నారు. కోర్ కమిటీ ఎదుట వాటిని బహిరంగం చేస్తానన్నారు. చివరకు నియోజకవర్గానికి ఒక పేరుతో సిఫారసు చేస్తారని, అవే ఖరారు కానున్నాయన్నారు. నేను గోకాక్ విషయం మాట్లాడుతున్నా అని అథణి అంశంపై చర్చించనన్నారు. పార్టీ సీనియర్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు.75ఏళ్లు పైబడిన వారి విషయం కూడా హై కమాండ్ ఎలాంటి చర్చ చేయలేదన్నారు. కర్ణాటకలో ఎటువంటి మోడల్ పాటి స్తారనేది తెలియలేదన్నారు.
మాజీ మంత్రి మాలకరెడ్డి కాంగ్రెస్ గూటికి ..?
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత కల్యాణ కర్ణాటకలో పట్టు కల్గిన మాజీ మంత్రి డాక్టర్ ఏబీ మాలకరెడ్డి(Former Minister Dr. AB Malakareddy) కాంగ్రెస్ గూటికి చేరడం ఖరారైంది. ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారు. మాలకరెడ్డి కుమార్తెను కాంగ్రెస్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను భేటీ అయ్యారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను భేటీ అయ్యేందుకు బెంగళూరుకు వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాలకరెడ్డి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీలో చేరారు. ఖర్గేను ఓడించిన బృందంలో మాలకరెడ్డి కూడా ఒకరు. ఆయన కుమార్తె అనురాగ మాలకరెడ్డికి యాదగిరి టికెట్‌ను ఆశిస్తున్నారు. బీజేపీలో సాధ్యం కాదనే కాంగ్రెస్‌లో చేరుతున్నారు.