Former MLA: మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. బీజేపీలో నిజాయతీపరులకు విలువ లేదు
ABN , First Publish Date - 2023-09-18T12:23:17+05:30 IST
బీజేపీలో నిజాయితీపరులైన కార్యకర్తలకు విలువ లేదని పార్టీ మాజీ ఎమ్మెల్యే రేణుకాచార్య(Former MLA Renukacharya) ఆరోపించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీలో నిజాయితీపరులైన కార్యకర్తలకు విలువ లేదని పార్టీ మాజీ ఎమ్మెల్యే రేణుకాచార్య(Former MLA Renukacharya) ఆరోపించారు. ఆదివారం దావణగెరెలో ఉద్యానవనశాఖ మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున్‌ను భేటీ అయ్యాక మాట్లాడారు. మా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, భద్ర కాలువ విషయాలను మంత్రితో చర్చించానన్నారు. శివమొగ్గ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మధు బంగారప్పను కలవడం వెనుక రాజకీయ చర్చలు జరపలేదన్నారు. కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమే అన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని ఎవరూ ఆహ్వానించలేదన్నారు. ప్రస్తుతానికి నేను బీజేపీలోనే ఉన్నానన్నారు. బీజేపీలో నిజాయతీ కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని, పార్టీ కోసం పనిచేసినవారిని కాకుండా జిల్లా అధ్యక్షులు వారికి అనుకూలమైన వారిని కమిటీలో చేర్చుకున్నారన్నారు. నన్ను హెచ్చరించే అధికారం జిల్లా బీజేపీ అధ్యక్షులకు లేదన్నారు. కాంగ్రెస్ నేత జగదీశ్ శెట్టర్ ఫోన్ చేసింది వాస్తవమేనన్నారు.