Gali Janardhan Reddy: ‘గాలి’ కుటీరాన్ని దగ్ధం చేసిన వారిని అరెస్టు చేయాలి
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:47 PM
గంగావతి తాలూకా ఆనెగొంది సమీపంలో తుంగభద్ర నది పక్కన ఉండే పంపాసరోవరం సమీపంలో గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) ఉండే కుటీరాన్ని దగ్ధం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గురువారం బళ్లారిలో కేఆర్‌పీపీ పార్టీ నాయకులు ధర్నా చేశారు.
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): గంగావతి తాలూకా ఆనెగొంది సమీపంలో తుంగభద్ర నది పక్కన ఉండే పంపాసరోవరం సమీపంలో గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) ఉండే కుటీరాన్ని దగ్ధం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గురువారం బళ్లారిలో కేఆర్‌పీపీ పార్టీ నాయకులు ధర్నా చేశారు. కేఆర్‌పీపీ పార్టీ బళ్లారి జిల్లా అధ్యక్షుడు దమ్మూరు శేఖర్ ఆద్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎస్ దివాకర్, మున్నాబాయ్, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ తదితరులు ముందుగా రాయల్ సర్కిల్ నుండి ర్యాలీగా డీసీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కుటీరం దగ్ధం చేసిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మున్నాబాయ్ మాట్లాడుతూ గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) కుటీరాన్ని కావాలనే కాల్చేశారని పేర్కొన్నారు. వీరితో పాటు మల్లికార్జున ఆచారి, హుండేకార్ రాజేష్, శ్రీనివాసులు, ప్రభుశేఖర్, పివి శ్రీనివాసులు, జే. తిమ్మప్ప, సునీత, విజయకుమార్, హంపీ రమణ, రోసిరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు గోవిందరాజులు, కొలగళ్లు అంజిని, మారెష్, హనుమేష్, వీరశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.