Gaurav Gogoi: బీజేపీ మన భారతదేశాన్ని అంధకారంలో ఉంచింది.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గౌరవ్ గొగోయ్

ABN , First Publish Date - 2023-09-05T22:09:34+05:30 IST

కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను వెల్లడించకుండా..

Gaurav Gogoi: బీజేపీ మన భారతదేశాన్ని అంధకారంలో ఉంచింది.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గౌరవ్ గొగోయ్

కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను వెల్లడించకుండా.. మన దేశాన్ని బీజేపీ అంధకారంలో ఉంచిందని ధ్వజమెత్తారు. గౌరవ్ గొగోయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు సోనియా గాంధీ అధ్యక్షతన, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లు, హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులు వంటి ముఖ్యమైన అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించడం జరిగింది’’ అని తెలిపారు.


ఇంకా గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరు 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేశారు. కానీ.. ఈ సెషన్ ఎజెండా ఏమిటో బీజేపీ ఇంతవరకూ బయటపెట్టడం లేదు. ఈ విషయంపై బీజేపీ భారతదేశాన్ని అంధకారంలో ఉంచింది. ఈ ప్రభుత్వానికి దేశం పట్ల పారదర్శకత, బాధ్యత ఏమాత్రం లేదు. అసలు ఈ సెషన్ ఎజెండా ఏమిటన్నది బీజేపీకే క్లారిటీ లేదు. అయితే.. ఈ సెషన్‌లో దేశంలోని ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లతో పాటు దేశంలోని ఇతర సమస్యలపై చర్చించడానికి.. అలాగే వాటిపై సలహా సూచనలు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. దేశ సమస్యలపై చర్చ జరగాలన్నదే తమ సూత్రమని ఆయన తెలిపారు.

మరో కాంగ్రెస్ నేత జైరా రమేశ్ సైతం బీజేపీపై మండిపడ్డారు. ముంబైలో ఇండియా మీటింగ్ నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చారని, ఈ ఐదు రోజుల పాటు (సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు) తాము మోదీ చలిసా వినబోమని దుయ్యబట్టారు. అసలు ఈ సెషన్‌లో ఎలాంటి విషయాలపై చర్చిస్తారనే సమాచారం తమకు లేదన్నారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో.. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలని తమ పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అయితే.. ఈ సెషన్‌లో ప్రజల సమస్యలపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-05T22:09:34+05:30 IST