Moscow-Goa plane: గోవా విమానానికి రెండోసారి బాంబు బెదిరింపు...ఉజ్బెకిస్థాన్ మళ్లింపు

ABN , First Publish Date - 2023-01-21T12:39:33+05:30 IST

బాంబు బెదిరింపుతో మాస్కో-గోవా విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు....

Moscow-Goa plane: గోవా విమానానికి రెండోసారి బాంబు బెదిరింపు...ఉజ్బెకిస్థాన్ మళ్లింపు
Moscow-Goa plane

పనాజీ (గోవా): బాంబు బెదిరింపుతో మాస్కో-గోవా విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు.(Moscow-Goa plane)రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్తున్న అజూర్ ఎయిర్ చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది.రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన చార్టర్డ్ విమానాన్ని శనివారం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు.(Diverted to Uzbekistan) ఏజేవీ 2463 అనే విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే దారి మళ్లించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ విమానం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.

విమానంలో బాంబు అమర్చినట్లు దబోలిమ్ విమానాశ్రయ డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈమెయిల్ రావడంతో దాన్ని దారి మళ్లించారు.11 రోజుల్లో మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు ఘటన ఇది రెండోసారి.

Updated Date - 2023-01-21T12:44:16+05:30 IST