Good news: వ్యాపారులకు తీపి కబురు చెప్పిన రాష్ట్రప్రభుత్వం.. అదేంటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-10-11T07:08:12+05:30 IST

రాష్ట్రంలో వ్యాపారులను పెండింగ్‌ పన్ను బకాయిల కేసుల నుంచి విముక్తి కలిగించే దిశగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

Good news: వ్యాపారులకు తీపి కబురు చెప్పిన రాష్ట్రప్రభుత్వం.. అదేంటో తెలిస్తే...

- రూ.50వేల లోపు పన్ను బకాయిల మాఫీ

- 4 నెలల వరకూ రాజీ పథకం ఫ అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యాపారులను పెండింగ్‌ పన్ను బకాయిల కేసుల నుంచి విముక్తి కలిగించే దిశగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) సరికొత్త రాజీ పథకాన్ని ప్రకటించారు. రూ.50 వేలలోపు పన్ను బకాయిలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో 95 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో సభా నిబంధన 110 కింద ఆయన ప్రకటన జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను బకాయిలకు సంబంధించి 2,11,607 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి సంబంధించి 1.42 లక్షలకు పైగా వ్యాపార సంస్థల నుంచి సుమారు రూ.26వేల కోట్లకు పైగా పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉందని, ఇంతటి భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాణిజ్య పన్నుల శాఖకు పనిభారం అధికం కావడమే కాకుండా వ్యాపారులు కూడా ఎన్నో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీరి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన పన్ను బకాయాలు కూడా భారీగా ఉన్నాయని, ఈ పెండింగ్‌ పన్నుల బకాయిలు తిరిగి చెల్లించటంలో ఏవైనా రాయితీలు ప్రకటించి దీర్ఘకాలిక సమస్యకు ముక్తాయింపు పలకాలని వ్యాపారులు కోరుతున్నారని స్టాలిన్‌ చెప్పారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ రాజీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. దాని ప్రకారం పన్నులు, వడ్డీ, జరిమానా అంటూ రూ.50వేల కంటే తక్కువగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. చిరు వ్యాపారులకు పెండింగ్‌లో ఉన్న పన్నులు, వడ్డీ, జరిమానాను తోసివేయడం ఇదే ప్రప్రథమమని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా 1,40,398 కేసుల నుంచి 95,502 మంది వ్యాపారులు లబ్ధిపొందుతారని ఆయన తెలిపారు. ఇదేవిధంగా రూ. 50వేల నుంచి రూ.10లక్షల మేరకు చెల్లించాల్సిన వ్యాపారులు, రూ.10లక్షల నుంచి రూ. కోటి దాకా పన్నులు, జరిమానా, వడ్డీ చెల్లించాల్సినవారు, కోటి రూపాయల నుంచి రూ.10 కోట్ల వరకు పన్ను బకాయిలు చెల్లించాల్సినవారు, రూ.10 కోట్లకు పైగా పన్ను బకాయిలు చెల్లించాల్సినవారు అంటూ మరో నాలుగు వర్గాలుగా విభజించామని, ఈ వర్గాలకు చెందినవారు 20 శాతం బకాయిలు చెల్లించి కేసుల నుంచి బయట పడవచ్చునని ఆయన తెలిపారు. ఈ రాజీ పఽథకం ఈనెల 16 నుంచే అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

nani1.jpg

Updated Date - 2023-10-11T07:08:12+05:30 IST