Karnataka: కేబినేట్‌లోకి అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు.. డీకేకి చెక్ పెట్టేందుకేనా?

ABN , First Publish Date - 2023-09-23T15:25:50+05:30 IST

లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha) ముందు మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల(Deputy CMs)ను నియమించే ప్రతిపాదనను కర్ణాటక(Karnataka) ప్రభుత్వం పరిశీలిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి(Basavaraja Rayareddy) శనివారం తెలిపారు.

Karnataka: కేబినేట్‌లోకి అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు.. డీకేకి చెక్ పెట్టేందుకేనా?

లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha) ముందు మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల(Deputy CMs)ను నియమించే ప్రతిపాదనను కర్ణాటక(Karnataka) ప్రభుత్వం పరిశీలిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి(Basavaraja Rayareddy) శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని మంత్రివర్గంలోకి మరో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను తీసుకురావాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఇప్పటికే కొంతమంది మంత్రులు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం డీకే శివకుమార్‌(DK Shivakumar) ఒక్కరే డిప్యూటీ మినిష్టర్ గా ఉన్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే జి. పరమేశ్వర, MB పాటిల్‌తో సహా మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులు మద్దతు తెలిపారు. మెరుగైన పాలన అందించడానికి ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సైతం అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్న విషయాన్ని ఆయన ఉదహరించారు. అందరూ అంగీకరిస్తే తమ రాష్ట్రంలోనూ ఆరు మంది డిప్యూటీ సీఎంలు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి చెక్ పెట్టేందుకే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచిస్తోందని పొలిటికల్ విశ్లేషకుల వాదన.

Updated Date - 2023-09-23T15:28:51+05:30 IST