SCs reservations: గ్రూప్ ఏ, బీ ప్రమోషన్లలో ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్

ABN , First Publish Date - 2023-08-28T21:20:28+05:30 IST

ఛండీగఢ్: హర్యానా (Haryana)లోని బీజేపీ (BJP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏ, బీ (Group A, B) ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో షెడ్యూల్డ్ కులాల (SC) వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ (Manohar Lal Khattar) ప్రకటించారు. సోమవారంనాడు అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.

SCs reservations: గ్రూప్ ఏ, బీ ప్రమోషన్లలో ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్

ఛండీగఢ్: హర్యానా (Haryana)లోని బీజేపీ (BJP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏ, బీ (Group A, B) ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో షెడ్యూల్డ్ కులాల (SC) వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ (Manohar Lal Khattar) ప్రకటించారు. సోమవారంనాడు అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఇంతవరకూ గ్రూప్ సీ, డీ ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో కోటా లిమిట్ ఉండేదని, ఉన్నత క్యాడర్‌లో ఎస్‌సీల పార్టిసిపేషన్‌కు సంబంధించిన గణాంకాలకు విశ్లేషించి తాజా నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వం చూపించిన చొరవను ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా స్వాగతించారు. ప్రమోషన్ బ్యాగ్‌లాగ్స్‌ను క్లియర్ చేయాలని కోరారు.

Updated Date - 2023-08-28T21:20:28+05:30 IST