Mallikarjun Kharge: జెండా నిరభ్యంతరంగా ఎగరేసుకోవచ్చు...కాకపోతే..!

ABN , First Publish Date - 2023-08-16T17:03:16+05:30 IST

వచ్చే ఏడాది ఎర్రకోటకు తిరిగి వస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ నుంచి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్పికొట్టారు. వచ్చే ఏడాది కూడా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చని, అయితే ఆ పని ఇంటి నుంచి చేసుకోవచ్చని అన్నారు.

Mallikarjun Kharge: జెండా నిరభ్యంతరంగా ఎగరేసుకోవచ్చు...కాకపోతే..!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఎర్రకోటకు తిరిగి వస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ (Red Fort) నుంచి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తిప్పికొట్టారు. మోదీ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారంనాడు ఆయన స్పందిస్తూ, వచ్చే ఏడాది కూడా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చని, అయితే ఆ పని ఇంటి నుంచి ఆయన చేసుకోవచ్చని అన్నారు.


ఎర్రకోట వేదకగా ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో ఖర్గే ఈసారి పాల్గొనలేదు. తనకు కంటి సమస్యలు ఉండటం, ఏఐసీసీ కార్యాలయంలో జరిగే వేడుకలకు హాజరుకావాల్సి ఉండటం ఇందుకు కారణాలని, అదీగాక ప్రధాని వెళ్లకుండా ఏ ఒక్కరినీ పంపించని భారీ భద్రతా సమస్యలు, తనకున్న సమయాభావం కూడా కారణాలని మీడియాకు ఆయన వివరించారు.


ఎర్రకోట నుంచి మోదీ ఏమన్నారంటే?

వచ్చే ఏడాది ఎర్రకోటకు తిరిగి వస్తానని, ఎర్రకోట వేదకగా దేశ ప్రగతిని తాను వివరిస్తానని మోదీ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా పదో సారి ఎర్రకోట వేదికపై జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా 2047 నాటికి స్వాతంత్ర్య సాధించి వందేళ్లు పూర్తి అవుతుందని, అప్పటికి దేసాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామన్నారు. బుజ్జగింపు రాజకీయాలతో దేశం చాలా నష్టపోయిందంటూ విపక్షాల తీరును ఆయన పరోక్షంగా ఎండగట్టారు. అవినీతి రహిత, కుటుంబ పాలనా రహిత దేశంతోనే ప్రగతి సాధ్యమన్నారు. 140 కోట్ల నా కుటుంబ సభ్యులారా..అంటూ మోదీ తన ప్రసంగం సాగించారు.

Updated Date - 2023-08-16T17:03:16+05:30 IST