Heart Attack: డ్యాన్స్ చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్

ABN , First Publish Date - 2023-03-20T21:09:43+05:30 IST

గుండె సమస్యలు, రానురాను ఎక్కువైపోతున్నాయి. నేటి కాలంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు ఎక్కువైపోయాయి.

Heart Attack: డ్యాన్స్ చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్

భోపాల్: డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే ఓ ప్రభుత్వ అధికారి మృతి చెందిన షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. పోస్టల్ డిపార్టుమెంట్‌ ఉన్నతాధికారి ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కిందపడిపోయి మృతిచెందాడు. రిపోర్టుల్లో ఆయన గుండెపోటుకు గురైనట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌(Postal Department)లో అసిస్టెంట్ డైరెక్టర్‌(Assistant Director)గా సురేంద్ర కుమార్ దీక్షిత్ పనిచేస్తున్నాడు. మార్చి 13న భోపాల్‌లోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించింది. మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఉండగా 16న సాయంత్రం ఆఫీసులో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో ‘‘బస్ ఆజ్‌కీ రాత్ హై జిందగీ, కల్ హమ్ కౌన్, తుమ్ కౌన్’’ అనే పాటకు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా సురేంద్రకుమార్ దీక్షిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్నవారంతా అతనికి సాయం చేసేందుకు ప్రయత్నించారు.. కానీ ఫలితం లేకుండా పోయింది.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఇండోర్‌(Indore)లోని ఒక పాఠశాలలో ఓ 16 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. బృందా త్రిపాఠి అనే 11వ తరగతి విద్యార్థిని ఉషానగర్ ప్రాంతంలోని తన పాఠశాలలో ఈవెంట్ కోసం రిహార్సల్ చేయడానికి పాఠశాలకు వెళ్లిన బాలిక కుప్పకూలిపోయింది. బృందా త్రిపాఠిని వెంటనే ఆస్పత్రికి తరలించగా సీపీఆర్ (CPR) ఆమెను కాపాడేందుకు డాక్టర్లు(Doctors) ప్రయత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బృందా అప్పటికే మృతి చెందింది.

గుండె సమస్యలు, రానురాను ఎక్కువైపోతున్నాయి. నేటి కాలంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. ఇంతకు ముందు గుండెనొప్పులు అంటే వృద్ధప్యానికి దగ్గర్లో కనీసం 50 ఏళ్ళ తర్వాత వచ్చేవి. కానీ, ఇప్పుడు అలా కాదు. 20 ఏళ్ళలోనూ గుండె సమస్యలు వచ్చి కన్నుమూసినవారు ఎందరో ఉన్నారు. దీంతో వైద్యులు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాల గురించి తెలుసుకుని జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు నిపుణులు.

కార్డియాక్ అరెస్ట్(Cardiac Arrest) అంటే ఏమిటి?

హార్ట్ ఓఆర్‌జీ అందిస్తున్న సమాచారం ప్రకారం, కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమీ కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో, అంటే గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీని వల్ల కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్‌కు సరైన సమయంలో, సరైన చికిత్స లభించనట్టయితే రోగి కొద్ది సెకన్లలో లేదా నిమిషాల్లో మరణించే అవకాశం ఉంది.

డాక్టర్‌ని కలవాల్సిందే..

గుండె కొట్టుకోవడం సడెన్‌గా ఆగిపోవడాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది వచ్చినప్పుడు శ్వాస సమస్యలు ఎదురై వృక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం, సీపీఆర్ జరగాలి. లేకపోతే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలలో ఒకటి స్పందించకపోవడం.

సీపీఆర్‌ (CPR) చేస్తే..

వ్యక్తి గుండె ఆగిపోయినప్పుడు, డాక్టర్‌కి దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. సీపీఆర్(CPR), కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం గుండెకి మేలు చేస్తుంది. ఇది గుండెను పంప్ చేసే విధంగా కాపాడుతుంది. సీపీఆర్ చేసే ముందు వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడో లేదా కనుక్కోవాలి. ఎందుకంటే, సీపీఆర్ కంప్రెషన్ సాధారణ హృదయ స్పందనకు అంతరాయ కలిగించొచ్చు. సీపీఆర్‌లో, ఓ వ్యక్తి ఛాతీపై గట్టిగా, వేగంగా నెట్టాలి. దీంతో, నిమిషానికి 100 నుండి 120 వరకూ తోస్తుంది. ప్రతి 30 కుదింపుల తర్వాత రెస్క్యూ బ్రీత్స్ అవసరం అవుతాయి. గుండె సమస్యల లక్షణాలను ఎప్పుడూ విస్మరించొద్దు. డాక్టర్స్‌ని కలిసి వారి సలహాలు తీసుకోవచ్చు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Updated Date - 2023-03-20T21:15:07+05:30 IST