Chief Minister: సీఎం సంచలన ప్రకటన.. ఆ కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదు..

ABN , First Publish Date - 2023-10-12T08:26:05+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate) వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల్లో

Chief Minister: సీఎం సంచలన ప్రకటన.. ఆ కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదు..

- అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate) వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల్లో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. శాసనసభలో బుధవారం ఉదయం అన్నాడీఎంకే బహిష్కృత ఎమ్మెల్యే వైద్యలింగం కొడనాడు ఎస్టేట్‌ హత్య దోపిడీ కేసులపై తీసుకొచ్చిన సావధాన తీర్మానానికి స్టాలిన్‌ సమాధానం చెబుతూ... డీఎంకే అధికారంలోకి వచ్చాకనే ఆ కేసుల విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించామన్నారు. పోలీసులు ఇప్పటివరకూ జరిపిన విచారణ అంశాలపై నివేదికను త్వరలో ఊటీ న్యాయస్థానంలో సమర్పించనున్నారని తెలిపారు.

ముక్కొంబు ఉదంతంపై సమగ్ర విచారణ...

తిరుచ్చి జిల్లాలోని పర్యాటక ప్రాంతం ముక్కొంబు వద్ద యువతిపై ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతంపై సమగ్ర విచారణ జరుగుతోందని నిందితులుగా ఉన్న పోలీసులను సస్పెండ్‌ చేసి అరెస్టు చేసి కస్టడీకి పంపామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సంఘటనపై ప్రధాన ప్రతిపక్షం నేత ఎడప్పాడి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోలేదనడం అవాస్తవమని చెప్పారు. ఈ నెల 4వతేదీ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పర్యాటక ప్రాంతమైన ముక్కొంబుకు ఓ యువకుడు, 17 యేళ్ల యువతి వెళ్లారని ఆ సమయంలో వాహనాల తనిఖీ జరుపుతుండిన జియాపురం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ శశికుమార్‌, కానిస్టేబుళ్లు ప్రసాద్‌, శంకర రాజపాండ్యన్‌ చిత్తరథన్‌ కలిసి ఆ ఇద్దరిని నిర్బంధించారన్నారు. ఆ తర్వాత యువకుడిని పంపించేసి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. అయుతే యువతి కేకలకు భయపడి మార్గమధ్యంలోనే ఆమెను కిందకు దింపి వెళ్లిపోయారన్నారు. దీనిపై యువకుడు, యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

nani4.jpg

Updated Date - 2023-10-12T08:26:05+05:30 IST