High Court: 29న నటి విజయలక్ష్మిని హాజరుపరచండి

ABN , First Publish Date - 2023-09-27T09:03:44+05:30 IST

నామ్‌ తమిళర్‌ కట్చి చీఫ్‌ సీమాన్‌పై ఆరోపణలు చేసిన నటి విజయలక్ష్మి(Actress Vijayalakshmi)ని ఈనెల 29న హాజరుపరచాలని మద్రాసు హైకోర్టు

High Court: 29న నటి విజయలక్ష్మిని హాజరుపరచండి

- పోలీసులకు హైకోర్టు ఆదేశం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నామ్‌ తమిళర్‌ కట్చి చీఫ్‌ సీమాన్‌పై ఆరోపణలు చేసిన నటి విజయలక్ష్మి(Actress Vijayalakshmi)ని ఈనెల 29న హాజరుపరచాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీమాన్‌ పెళ్లి చేసుకుంటానని మోసగించిన తనపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడ్డారని విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. ఆ మేరకు వలసరవాక్కం పోలీసుస్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీమాన్‌పై తాను చేసిన ఆరోపణులన్నింటిన వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విజయలక్ష్మి బెంగళూరుకు వెళ్లి పోయారు. అయితే పోలీసులు విజయలక్ష్మి ఫిర్యాదుపై విచారణను కొనసాగించడంతో సీమాన్‌ ఆ కేసును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి నటి విజయలక్ష్మిని ఈనెల 29న తన ఎదుట హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.

nani9.2.jpg

ఇదికూడా చదవండి: వచ్చే ఆరు నెలలు మనకు చాలా కీలకం.. జాగ్రత్త

Updated Date - 2023-09-27T09:03:44+05:30 IST