Geminids: ఆకాశంలో అద్భుతం.. మిస్సయ్యారా అయితే ఈ రోజు చూడండి..
ABN , Publish Date - Dec 16 , 2023 | 09:07 AM
ఆకాశంలో అద్భుతం జరుగుతోంది. జెమినిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తోంది. ఆకాశం నుంచి భూమిపైకి రాలే తోక చుక్కలను చూడడానికి ప్రజలంతా తెగ ఆసక్తి చూపుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ వరకు ఈ తోక చుక్కలను చూడవచ్చు.
ఆకాశంలో అద్భుతం జరుగుతోంది. జెమినిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తోంది. ఆకాశం నుంచి భూమిపైకి రాలే తోక చుక్కలను చూడడానికి ప్రజలంతా తెగ ఆసక్తి చూపుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ వరకు ఈ తోక చుక్కలను చూడవచ్చు. ఈ నెల 20 వరకు ఇవి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. పాథియానే అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపించనున్నాయి. సాధారణంగా పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి తిరుగుతుంటుంది. ఇది కొద్ది నెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఇవి గరిష్టంగా 150 వరకు ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ(ఐఎంఓ) తెలిపింది. వాటిని ఫోటోలు, వీడియోలు తీసి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చని సూచించింది.
జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని ఎలా చూడాలి
ఈ జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. రాత్రి పూట కాంతి ఉన్న ప్రదేశంలో కాకుండా చికటిగా ఉన్న ప్రాంతంలో నిలబడండి. లేదా పడుకోండి. ఆకాశం చక్కగా కనిపించే ప్రకాశవంతమైన ప్రాంతాన్ని ఎంచుకోండి. మీ పాదాలను దక్షిణం వైపు చూపిస్తూ ఆకాశం విస్తృత వీక్షణకు వీలుగా మీ వెనుకభాగంలో పడుకోండి. 15 నుంచి 20 నిమిషాలపాటు చీకటికి సర్దుబాటు చేసుకోండి. కాస్త ఓపికకగా చూడండి. అప్పుడు కనిపిస్తుంది. ఫోన్‌లో కూడా దీనిని రికార్డు చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఇంటరాక్టివ్ స్కై మ్యాప్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. అక్కడ ఉల్కాపాతం ఏర్పడుతుంది. ఒకవేళ ఇంకా చూడకుంటే ఈ రోజు రాత్రి చూసేయండి.