DK Shivakumar: సిద్ధరామయ్యతో విభేదాలు లేవు..

ABN , First Publish Date - 2023-05-14T15:29:47+05:30 IST

కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు.

DK Shivakumar: సిద్ధరామయ్యతో విభేదాలు లేవు..

బెంగళూరు: కాంగ్రెస్ (Congress) పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు. కాంగ్రెస్ సీఎం ఎంపిక కోసం కీలకమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జరగనుండటం, సీఎం రేసులో డీకే కూడా ఉండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

''సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నట్టు కొందరు అంటున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు'' అని తుంకూరులో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ డీకే స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలాసార్లు తాను త్యాగాలు చేశానని కూడా చెప్పారు. ఎన్నోచార్లు త్యాగాలు చేసి సిద్ధరామయ్య వెన్నంటే ఉన్నానని, తనకు సహనమే లేకుంటే మొదట్లోనే తాను మంత్రిని అయ్యే వాడిని కాదని, సిద్ధరామయ్యకు సహకరించేవాడిని కానని చెప్పారు.

సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజ... ఆయన డిప్యూటీగా డీకే..!

కాగా, కర్ణాటక సీఎం పదవి రేసులో సిద్ధరామయ్య ముందున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఆయనను సీఎం చేసేందుకు సానుకూలంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డీకే కష్టానికి తగినట్టుగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వునున్నట్టు చెబుతున్నారు. కీలకమైన మంత్రిపదవిని కూడా ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ చేయనున్నట్టు ఆ వర్గాలు ఉంటున్నాయి. సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి వి.సోమన్నపై గెలుపొందగా, డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేసి తన ప్రత్యర్థి జేడీయూ నేత బి.నాగరాజుపై 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

Updated Date - 2023-05-14T15:46:39+05:30 IST