Modi US visit: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్‌కమ్
ABN , First Publish Date - 2023-06-22T22:42:09+05:30 IST
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వాషింగ్టన్ చేరుకున్నారు.
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White house) చేరుకున్న మోదీకి అపూర్వస్వాగతం లభించింది. ఇరుదేశాల జాతీయ గీతాలాపనలు, 19 తుపాకీల సెల్యూట్‌తో గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ... ‘‘ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుంచి ప్రెసిడెంట్ అయ్యిన తర్వాత మేమిద్దరం చాలా సమయం గడిపాం. నమ్మకం ఆధారంగా భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నాం. ప్రపంచ పరిస్థితి దృష్ట్యా భారత్-అమెరికా ఉమ్మడిగా ఉండడం అవశ్యకం’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఇక భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఘనస్వాగతం పలికిన అధ్యక్షుడు జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య బంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇరుదేశాల రాజ్యాంగాలు 'We the people' అనే పదాలతో ప్రారంభమవుతాయని మోదీ అన్నారు. ఇరుదేశాలూ వైవిధ్యాన్ని గొప్పగా భావిస్తాయని పోల్చారు. కొవిడ్ తర్వాత ప్రపంచ క్రమం కొత్త రూపు సంతరించుకుంది. ప్రపంచ మేలు కోరుతూ విశ్వశాంత, స్థిరత్వం కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. కాగా వైట్‌హౌస్‌లో గురువారం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అంతేకాదు అగ్రరాజ్యం చట్టసభ యూఎస్ కాంగ్రెస్‌లో (US Congress) మోదీ ప్రసంగించనున్నారు.