India-Bangladesh : భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ విశేషాలు ఎన్నో....!

ABN , First Publish Date - 2023-03-18T10:27:27+05:30 IST

భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ (India-Bangladesh Friendship Pipeline (IBFPL)ను ఇరు దేశాల ప్రధాన మంత్రులు

India-Bangladesh : భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ విశేషాలు ఎన్నో....!
Sheik Hasina, Narendra Modi

న్యూఢిల్లీ : భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ (India-Bangladesh Friendship Pipeline (IBFPL)ను ఇరు దేశాల ప్రధాన మంత్రులు శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభిస్తారు. ఇది ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులను దాటుకుని నిర్మితమైన మొట్టమొదటి డీజిల్ సరఫరా పైప్‌లైన్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా (PM Sheikh Hasina) శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించబోతున్న ఈ పైప్‌లైన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

1. భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ పొడవు 131.5 కిలోమీటర్లు. భారత దేశం నుంచి డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేయడానికి దీనిని వినియోగిస్తారు.

2. దీని అంచనా వ్యయం రూ.377 కోట్లు. బంగ్లాదేశ్ సెక్షన్ పైప్‌లైన్‌కు అంచనా వ్యయం రూ.285 కోట్లు.

3. దీని గుండా ఈ ఏడాది జూన్ నుంచి ప్రయోగాత్మకంగా డీజిల్ సరఫరా ప్రారంభమవుతుంది.

4. భారత దేశ గ్రాంట్ ఫండింగ్ సహాయంతో 2018లో దీని నిర్మాణం ప్రారంభమైంది.

5. సంవత్సరానికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల హైస్పీడ్ డీజిల్‌ను ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఏడు జిల్లాలకు సరఫరా చేస్తారు.

6. నుమలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన సిలిగురి మార్కెటింగ్ టెర్మినల్ నుంచి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన పర్బతిపూర్ డిపోనకు ఈ పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా అవుతుంది.

7. ఈ ఒప్పందం 15 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. అయితే ఆ తర్వాత దీనిని పొడిగించుకోవచ్చు.

8. భారత దేశం నుంచి విశ్వసనీయమైన, నమ్మదగిన, తక్కువ ఖర్చుతోకూడిన, పర్యావరణ హితకరమైన హైస్పీడ్ డీజిల్ బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతుంది.

9. ఇంధన భద్రతలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవడం కోసం ఈ పైప్‌లైన్ దోహదపడుతుంది.

10. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి :

AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. వాయిదా తీర్మానంపై టీడీపీ పట్టు.. గందరగోళం

Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్‌?

Updated Date - 2023-03-18T10:27:27+05:30 IST