Share News

Congress:ఇండియా కూటమి కాంగ్రెస్‌కు కీలకమే.. కానీ..! మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-04T16:51:39+05:30 IST

ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు.

Congress:ఇండియా కూటమి కాంగ్రెస్‌కు కీలకమే.. కానీ..! మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి జేడీయూ అధినేత నితీష్‌తో ఖర్గే ఫోన్లో మాట్లాడుతూ.. ఇండియా కూటమి కాంగ్రెస్ కీలకమని భావించిందని, అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష కూటమి వ్యూహం, ఉమ్మడి ర్యాలీలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ దృష్టి సారించిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని నితీష్ కుమార్ విమర్శించారు.


నవంబర్ 2న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వ్యవహారంతో ఇండియా కూటమి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలలో జరగనున్న శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన నేపథ్యంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. ఎన్డీఏ కూటమి నుంచి బయటకి వచ్చాక ఇండియా కూటమితో నితీష్ జత కట్టారు. పట్నాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI) ర్యాలీని ఉద్దేశించి నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం.ఇండియా కూటమిలో వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ వారితో చర్చలు ఫలప్రదంగా లేవు. కాంగ్రెస్ మాత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కూటమిలో కాంగ్రెస్ ది ప్రధాన పాత్ర. పార్టీల మధ్య మనస్పర్థలు వస్తే పరిష్కరించాల్సిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది" అని అన్నారు. ఇండియా కూటమి నేతల చివరి సమావేశం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 మధ్య కాలంలో ముంబయిలో జరిగింది. తరువాతి మీటింగ్లు జరగాల్సి ఉన్నా కాంగ్రెస్ ఇప్పటికీ ఆ వివరాలు వెల్లడించలేదు. మధ్యప్రదేశ్ లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పినా ఇప్పటికీ స్పందన లేదు. ఇండియా కూటమి బలోపేతం కోసం నితీష్ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితర నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఇవి జరిగాయి. ఇండియా కూటమి తొలి సమావేశం జూన్ లో పట్నాలో జరిగింది. ఢిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ని కాంగ్రెస్ వ్యతిరేకించకపోవడంతో ఆప్ సమావేశానికి దూరంగా ఉంది. అప్పడు నితీష్ రెండు పార్టీల మధ్య సమస్యను పరిష్కరించారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్ల పంపకంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు మధ్య ఏర్పడిన వివాదం ఇండియా కూటమిలో మరో సారి లుకలుకలు బయటపెట్టింది. ఈ టైంలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారిస్తే మంచిదని నితీష్ వాదన. ఈ కామెంట్స్ పై ఖర్గే నితీష్ తో ఫోన్లో మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను(NDA) ఢీకొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పడింది.

Updated Date - 2023-11-04T16:51:40+05:30 IST