INDIA bloc meeting: ఇండియా కూటమి సమావేశం.. సీట్ల షేరింగ్‌పై ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ ప్యానెల్
ABN , Publish Date - Dec 19 , 2023 | 05:18 PM
ఇండియా కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటల్‌పై మంగళవారంనాడు మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఇండియన్ నేషనల్ డవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I.N.D.I.A.) కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటల్‌పై మంగళవారంనాడు మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ అంశమే ఈసారి సమావేశంలో కీలక ఎజెండాగా ఉంది. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారంలో హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలనే డిమాండ్‌పై విపక్షాలకు-బీజేపీకి మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీట్ల షేరింగ్‌పై ప్యానెల్ ఏర్పాటు
కాగా, లోక్‌సభలో సీట్ల షేరింగ్ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన నేషనల్ అలెయెన్స్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూటమి భాగస్వాములతో కమిటీలోని నలుగురు సీనియర్ నేతలు సంప్రదింపులు జరుపుతారు. ఈ కమిటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోహన్ ప్రకాష్ సారథ్యం వహిస్తారు. ఆయన కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, కేంద్ర మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్ ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేషనల్ అలయెన్స్ కమిటీని ఏర్పాటు చేశారని, తక్షణం ఇది అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.