Indian Railways: దేశవ్యాప్తంగా నేడు 444 రైళ్ల రద్దు...ప్రయాణికుల అవస్థలు...కారణం ఏందంటే...
ABN , First Publish Date - 2023-02-17T10:53:49+05:30 IST
దేశవ్యాప్తంగా పలు రూట్లలో శుక్రవారం ఒక్కరోజే 444 రైళ్లను రద్దు చేశారు....
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.(Indian Railways) దేశవ్యాప్తంగా పలు రూట్లలో శుక్రవారం ఒక్కరోజే 444 రైళ్లను రద్దు చేశారు.(Cancels 440 Trains) వివిధ కారణాల వల్ల దేశంలో పలు రైళ్ల రద్దు, రీషెడ్యూలింగ్, డైవర్షన్స్, రైళ్ల రూట్ల కుదింపు(Diversion, short termination) వల్ల రైలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఇది కూడా చదవండి : Viral Video: సినీ నటుడిని బలవంతంగా ముద్దాడబోయిన మహిళా అభిమాని...ఆపై ఏం జరిగిందంటే...
రైలు ప్రమాదాలు, వాతావరణ ప్రభావాల వల్ల పలు రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది. 63 రైళ్ల రూట్లను మార్చారు. మరో 58 రైళ్లను కుదించారు. 16 రైళ్లను రీషెడ్యూల్(rescheduling) చేశారు. మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్ సైట్ లో చూడాలని రైల్వే శాఖ అధికారి కోరారు.
ఇది కూడా చదవండి : Hardik Pandya: మళ్లీ హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్థిక్ పాండ్యా, నటాసాల పెళ్లి వేడుక
సికింద్రాబాద్, పటాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్, దర్భంగా, సీల్ధా, హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, హోషియార్ పూర్, జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, బిలాస్ పూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో 444 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే అధికారులు చెప్పారు.దేశవ్యాప్తంగా పలు సాంకేతిక కారణాల వల్ల కూడా పలు రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని రైల్వే అధికారులు వివరించారు.