IPS officer Amritpaul: ఐపీఎస్‌ అధికారి అమృత్‌పౌల్‌కు బెయిల్‌

ABN , First Publish Date - 2023-09-29T08:53:19+05:30 IST

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అమృత్‌పౌల్‌(IPS officer Amritpaul) బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు.

IPS officer Amritpaul: ఐపీఎస్‌ అధికారి అమృత్‌పౌల్‌కు బెయిల్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అమృత్‌పౌల్‌(IPS officer Amritpaul) బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన ఆరు నెలలుగా కలబురిగి జైలులో ఉన్నారు. బెయిల్‌ కోసం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై కలబురిగి కోర్టులో విచారణలు జరిగాయి. ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి పీఏ నవాజ్‌ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణలకు సహకరించాలని, విదేశాలకు వెళ్లేందుకు వీలు లేదనే పలు నిబంధనలు విధించారు. ఏడీజీపీ స్థాయి అధికారి హోదాలో అమృత్‌పౌల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ముఖ్యులుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడిన మేరకు అరెస్టు అయ్యారు. ఆయనతో పాటు డీఎ్‌సపీ శాంతకుమార్‌ సహా సిబ్బంది, పరీక్షల నిర్వాహకులను, సూత్రధారులను అరెస్టు చేశారు.

Updated Date - 2023-09-29T08:53:19+05:30 IST