Asaduddin Owaisi: 2024లో అలా చేస్తే మోదీకే లాభం

ABN , First Publish Date - 2023-01-09T14:21:33+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా ఏ ఒక్కరిని పోటీకి నిలబెట్టినా అందువల్ల మోదీకే ప్రయోజనం జరుగుతుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్..

Asaduddin Owaisi: 2024లో అలా చేస్తే మోదీకే లాభం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఏ ఒక్కరిని పోటీకి నిలబెట్టినా అందువల్ల మోదీకే ప్రయోజనం జరుగుతుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. 'పాడ్ కాస్ట్ విత్ స్మితా ప్రకాష్' తాజా ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ విపక్షాలు పట్టుదలగా కృషి చేయాలన్నారు. 540 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ విపక్షాలు గట్టిపోటీ ఇవ్వాలని, బీజేపీపై విపక్షాల నుంచి సింగిల్ ఫేస్‌ను బరిలోకి దింపితే బీజేపీకే లబ్ధి చేకూరుతుందని అన్నారు. మోదీ వెర్సస్ అరవింద్ కేజ్రీవాల్ అయినా, మోదీ వెర్సస్ రాహుల్ గాంధీ అయినా మోదీనే లాభపడతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి మోదీపై విపక్షాల అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరైన అభ్యర్థి కాగలగుతారా అనే ప్రశ్నకు, మమతా బెనర్జీ ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలుసుకున్నారని, పీఎంకి ఆమె సరైన విపక్ష అభ్యర్థి కాగలుగుతారా అనేదే నిశ్చయంగా చెప్పలేమని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పార్లమెంటులో ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టారని, కానీ మోదీని ప్రశంసించారని ఒవైసీ గుర్తుచేశారు. 2024లో బీజేపీపై సమష్టి పోరుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని మమతాబెనర్జీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు గతంలో పిలుపునిచ్చారు.

Updated Date - 2023-01-09T14:21:36+05:30 IST