Dr Ambedkar : అంబేద్కర్‌పై జైన్ విశ్వవిద్యాలయం విద్యార్థుల కారుకూతలు
ABN , First Publish Date - 2023-02-11T16:19:53+05:30 IST
జైన్ (డీమ్డ్ టు బి) విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన ఓ స్కిట్ పెద్ద దుమారం రేపుతోంది. షెడ్యూల్డు కులాలు,
బెంగళూరు : జైన్ (డీమ్డ్ టు బి) విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన ఓ స్కిట్ పెద్ద దుమారం రేపుతోంది. షెడ్యూల్డు కులాలు, రిజర్వేషన్లు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లను ఎగతాళి చేస్తూ ఈ స్కిట్‌ను ప్రదర్శించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియోలో కనిపిస్తోంది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో విశ్వవిద్యాలయం అధికారులు స్పందించి, నిందితులపై చర్యల కోసం క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కులతత్వాన్ని ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.
ది డెల్రాయ్స్ బాయ్స్ (The Delroys Boys) పేరుతో కొందరు విద్యార్థులు ఈ స్కిట్‌ను ఈ నెల 4న ప్రదర్శించినట్లు సామాజిక మాధ్యమాల్లోని వీడియోలో కనిపిస్తోంది. షెడ్యూల్డు కులాలు, రిజర్వేషన్లు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లను ఎగతాళి చేసినట్లు కనిపించింది. నిమ్న కులస్థుడు ఓ అగ్ర వర్ణ యువతితో డేటింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు, బీఆర్ అంబేద్కర్‌ను బీర్ అంబేద్కర్‌గా అభివర్ణించినట్లు కనిపించింది. అంటరానితనంపై కూడా వీరు ఎగతాళి చేశారు. Mad Ads అనే పోటీ కార్యక్రమంలో భాగంగా ఈ స్కిట్‌ను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఊహాజనిత ఉత్పత్తులను హాస్య చతురతతో ప్రకటించడంలో పోటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రదర్శనను దళిత సంఘాలు తీవ్రంగా నిరసించాయి. బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు విద్యార్థులు ఈ స్కిట్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.