Share News

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

ABN , First Publish Date - 2023-11-12T18:49:54+05:30 IST

దీపావళి రోజు రంగురంగుల దీపాలు వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది.

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

జైపూర్: దీపావళి (Diwali) రోజు రంగురంగుల దీపాలు (Diyas) వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో (Cow Dung) 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది. హంగోనియా గోశాల నుంచి ఇందుకు అవసరమైన ఆవుపేడను సేకరించారు. జైపూర్ సమీపంలో ఈ గోసేవా ట్రస్టును రాజస్థాన్ ప్రభుత్వం, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 2016లో ఏర్పాటు చేసింది. 13,000 గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు.


గోరక్షణ సందేశం...

ఆవు పేడతో 3 లక్షల దీపాలు తయారు చేయడం వెనుక ఆవులను పరిరక్షించాలనే సందేశం ఉందని గోశాల నిర్వాహకులు తెలిపారు. పలువురు వాలంటీర్లు కొద్ది రోజులుగా వీటీని తయారు చేశారని చెప్పారు. ఆవుపేడకు సమపాళ్లలో పిండి, చెక్క పౌడరు, గింజల పౌడర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఒక మిషన్ సాయంతో దీపాలుగా తయారు చేసినట్టు చెప్పారు. ఈ పద్దతిలో నిమిషంలో 11 దీపాలు తయారువుతాయని తెలిపారు. గోసేవను ఇష్టపడే వారు, అందుకు అంకితమైన వారికి దీపాలను పంచిపెట్టామని, కొన్నింటిని సరసమైన ధరలకు మార్కెట్‌లో విక్రయించామని చెప్పారు. కాగా, ఇక్కడి శ్రీ కృష్ణ బలరామ్ మందిర్‌ను హరేకృష్ణ ఉద్యమం వారు నడుపుతున్నారు.

Updated Date - 2023-11-12T18:49:55+05:30 IST