Jammu and Kashmir : పుల్వామాలో టార్గెట్ కిల్లింగ్... కశ్మీరీ పండిట్ హత్య...
ABN , First Publish Date - 2023-02-26T12:26:52+05:30 IST
జమ్మూ-కశ్మీరు పోలీసులు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కాశీనాథ్ శర్మ కుమారుడు సంజయ్ శర్మపై
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో మరో టార్గెట్ హత్య జరిగింది. పుల్వామా జిల్లాలో ఆదివారం ఉదయం ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతుడు సంజయ్ శర్మ కశ్మీరు లోయలోని అచన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
జమ్మూ-కశ్మీరు పోలీసులు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కాశీనాథ్ శర్మ కుమారుడు సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ఇచ్చిన ట్వీట్‌లో, సంజయ్ పండిట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయనను ఉగ్రవాదులు చంపేశారని, ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మీయులందరికీ సానుభూతి తెలిపారు.
పర్వేజ్ అహ్మద్ ఖాద్రి అనే ట్విటరాటీ ఇచ్చిన ట్వీట్‌లో, బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ శర్మను ఉగ్రవాదులు హత్య చేశారని, ఆయన కుటుంబం విలపిస్తోందని పేర్కొన్నారు. రక్తం నీటిలా ప్రవహిస్తోందని, ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Delhi excise policy case : సీబీఐ విచారణకు వెళ్లే ముందు సిసోడియా రోడ్ షో
Maharashtra : మహారాష్ట్రలో రెండు శాసన సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం