Land Scam : సీఎంకు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2023-08-08T19:34:34+05:30 IST

భూముల కుంభకోణం కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి, జార్ఘాండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. ఆగస్టు 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ముందు అక్రమ మైనింగ్ కేసులో 2022 నవంబర్ 18న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ పిలిచింది.

Land Scam : సీఎంకు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: భూముల కుంభకోణం (Land Scam) కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి, జార్ఘాండ్ ముక్తి మోర్చా (JMM) నేత హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ED) సోమవారంనాడు సమన్లు పంపింది. ఆగస్టు 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ముందు అక్రమ మైనింగ్ కేసులో 2022 నవంబర్ 18న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ పిలిచింది.


మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం ఇచ్చేందుకు జార్ఖాండ్ రాజధాని రాంచీలో వచ్చే వారం అందుబాటులో ఉండాలని హేమంత్ సోరెన్‌ను తమ తాజా సమన్లలో ఈడీ కోరింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌ను గతంలోనూ ఈడీ ప్రశ్నించింది. కాగా, హేమంత్ సోరెన్ విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)లో భాగస్వామిగా ఉన్నారు. గత నెలలో బెంగళూరులో జరిగిన సమావేశానికి కూడా హాజరయ్యారు.

Updated Date - 2023-08-08T20:00:06+05:30 IST