Jobs: 247 మందికి ఉద్యోగాలు.. ఏయే శాఖల్లో అంటే..

ABN , First Publish Date - 2023-05-17T09:21:49+05:30 IST

చెన్నైలో 247 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఈ నియామకాలు జరిగాయి. .

Jobs: 247 మందికి ఉద్యోగాలు.. ఏయే శాఖల్లో అంటే..

- రాష్ట్రంలో 3 చోట్ల ‘ప్రధాని రోజ్‌గార్‌ మేళా’

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా యేడాదికి 10లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మంగళవారం ఉదయం రాష్ట్రంలో మూడు చోట్ల ప్రధాని రోజ్‌గార్‌ మేళా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక టి.నగర్‌ వాణీమహల్‌లో ఏర్పాటైన మేళాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman) పాల్గొని 247 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వనంతో ప్రారంభించారు. ఆ సందర్భంగా ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఉద్యోగ నియమాకాలు పంపిణీ చేస్తూ ప్రసంగిస్తున్న దృశ్యాలను ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ తర్వాత తపాలా శాఖ ఉద్యోగాలకు ఎంపికైన 188 మందికి, రైల్వే శాఖ ఉద్యోగాలకు ఎంపికైన 60 మందికి, పెట్రోలియం ఇంధన శాఖల్లో ఎంపికైన 8 మంది సహా మొత్తం 247 మందికి ఆమె నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉన్నతాధికారులు చారుకేశి, శ్రీదేవి, సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా తిరుచ్చిలో నిర్వహించిన ప్రధాని రోజ్‌గార్‌ మేళాలో కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి పాల్గొని 127 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మదురైలో ఏర్పాటైన మేళాలో 180 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు.

nani4.2.jpg

Updated Date - 2023-05-17T09:26:42+05:30 IST