Mamata Jogging: చీర, చెప్పులతో మమతా బెనర్జీ జాగింగ్..

ABN , First Publish Date - 2023-09-14T17:00:05+05:30 IST

స్పెయిన్ పర్యటన‌లో ఉన్న మమతా బెనర్జీ గురువారంనాడు తన దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించారు. తన ట్రేడ్‌మార్క్‌ అయిన చీర ధరించి, సింపుల్‌గా ఉంటే చెప్పులతో జాగింగ్‌లో పాల్గొన్నారు. చేతికి స్మార్ట్‌ వాచ్ ధరించారు. మాడ్రిడ్‌లోని ఓ పార్క్‌లో తన అనుచర బృందంతో కలిసి జాగింగ్‌ చేసిన వీడియోను ఆమె ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశారు.

Mamata Jogging: చీర, చెప్పులతో మమతా బెనర్జీ జాగింగ్..

మాడ్రిడ్: రాజకీయాల్లోనే కాదు, రోజువారీ కార్యక్రమాల్లోనూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banejee) చురుకుగా ఉంటారు. తన దినచర్యను అడపాదడపా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం స్పెయిన్ (Spain) పర్యటన‌లో ఉన్న మమతా బెనర్జీ గురువారంనాడు తన దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించారు. తన ట్రేడ్‌మార్క్‌ అయిన చీర ధరించి, సింపుల్‌గా ఉంటే చెప్పులతో జాగింగ్‌లో పాల్గొన్నారు. చేతికి స్మార్ట్‌ వాచ్ ధరించారు. మాడ్రిడ్‌లోని ఓ పార్క్‌లో తన అనుచర బృందంతో కలిసి జాగింగ్‌ చేసిన వీడియోను ఆమె ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశారు. 'స్టే ఫిట్, స్టే హెల్తీ ఎవ్రీవన్' అంటూ తన సందేశాన్ని కూడా జోడించారు. ఉదయమే జాగింగ్ రోజంతా మనను ఉల్లాసంగా ఉంచుతుందని, అందరూ ఫిట్‌నెస్‌తో, హెల్తీగా ఉండాలని ఆ సందేశంలో ఆమె పేర్కొన్నారు.


మమతా బెనర్జీ గతంలోనూ సోషల్ మీడియోలో వీడియోలు పోస్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 2019లో డార్జిలింగ్ హిల్స్‌లో జాగింగ్ చేసిన వీడియోను అందరితోనూ పంచుకున్నారు. తన టీమ్ మెంబర్స్‌తో 10 కిలోమీటర్లు ఆమె జాగింగ్ చేశారు. ఒక పార్క్‌లో సంగీత వాద్యం చేస్తూ మరో వీడియోను కూడా మమతాబెనర్జీ షేర్ చేశారు. సంగీతం జీవితంలో ఒక భాగమని, మనలో పరిణితి పెంచుతుందని, చివరిశ్వాస వరకూ తోడుగా ఉంటుందని సందేశం ఇచ్చారు. కాగా, మమతా బెనర్జీ స్పెయిన్ పర్యటనలో భాగంగా పాపులర్ స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'ల లిగా' ప్రెసిడెంట్‌ను మమతా బెనర్జీ కలుసుకోనున్నారు. ఫుట్‌బాల్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోనున్నారు.

Updated Date - 2023-09-14T17:00:05+05:30 IST