Karnataka Assembly Elections: కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల..
ABN , First Publish Date - 2023-04-06T13:15:41+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికలు (Karnataka Assembly Elections)లో 42 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్
న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికలు (Karnataka Assembly Elections)లో 42 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ (Congress) గురువారం విడుదల చేసింది. మొదటి జాబితాలో 124 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 58 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. ఎన్నికలు మే 10న జరుగుతాయి.
అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో రెండో జాబితాను విడుదల చేయడం ఒక రోజు ఆలస్యమైంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బుధవారం ఈ జాబితాను విడుదల చేయవలసి ఉండగా, కసరత్తు పూర్తి కాకపోవడంతో గురువారానికి వాయిదా వేసింది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రెండో జాబితా ఆలస్యమవడానికి కారణం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shiva Kumar), మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddharamaiah) వర్గాల మధ్య పోరు తీవ్రంగా ఉండటమేనని తెలుస్తోంది. ఇరువురు నేతలు తమకు అనుకూలురైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 100 స్థానాలకు అభ్యర్థులను రెండో జాబితాలోనే ప్రకటిస్తారని మొదట్లో భావించినప్పటికీ నేతల మధ్య పోటీ కారణంగా అది సాధ్యం కాలేదని సమాచారం.
బీజేపీకి రాజీనామా చేసి, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బాబూరాయ్ చించన్సుర్‌కు గుర్మిట్కల్ నియోజకవర్గం బరిలో నిలిపింది. బేలూరు నుంచి బీ శివరామ్, మాండ్య నుంచి రవి కుమార్, ఉడుపి నుంచి ప్రసాద్ రాజ్ కచన్, తుముకూరు సిటీ నుంచి ఇక్బాల్ అహ్మద్‌లను పోటీ చేయిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గం నుంచి బరిలో దించింది. కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివ కుమార్ పోటీ చేస్తారని తెలిపింది. ఈ స్థానం నుంచి శివ కుమార్ 2008 నుంచి విజయం సాధిస్తున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) తనయుడు ప్రియాంక్ ఖర్గే చితపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ తెలిపింది. బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పుట్టన్నకు రాజాజీ నగర్ టిక్కెట్‌ను ఇచ్చింది.
ఇవి కూడా చదవండి :
Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
AAP : ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టులో షాక్