Karnataka BJP: యడియూరప్పకు మరో కీలక పదవి.. డిసైడ్ అయిన బీజేపీ హైకమాండ్

ABN , First Publish Date - 2023-03-03T10:48:45+05:30 IST

యడియూరప్ప(Yeddyurappa)కు మరో కీలక పదవి కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు

Karnataka BJP: యడియూరప్పకు మరో కీలక పదవి.. డిసైడ్ అయిన బీజేపీ హైకమాండ్

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): యడియూరప్ప(Yeddyurappa)కు మరో కీలక పదవి కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షుడిగా యడియూరప్పను నియమించదలచినట్లు సమాచారం. రెండేళ్ళ కిందట సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ యడియూరప్పను దూరం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలు వస్తున్న మేరకు ప్రచారసమితి అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్దమయ్యారు. యడియూరప్ప జన్మదినం రోజునే శివమొగ్గ ఎయిర్‌పోర్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. యడియూరప్పకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనేందుకు ఇదో ఉదాహరణగా ఉంది. బీజేపీకు దశాబ్దాల కాలంగా వీరశైవ లింగాయతుల మద్దతు ఉంది.

ఇందుకు యడియూరప్పను ప్రోత్సహించేదిశగా వందలాది మఠాధిపతులు సహకరించారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సమితి బాధ్యతను ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎంబీ పాటిల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో కొంత మేరనైనా సమాజానికి చెందిన వారు అటువైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే అదే హోదాను యడియూరప్పకు కట్టబెట్టదలచారు. తద్వారా యడియూరప్పకు పార్టీలో ఏమాత్రం తిరుగులేదని ఆదిశగానే పార్టీ అధిష్టానం సహకరిస్తోందనేలా కీలక హోదా అప్పగించనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-03-03T10:48:45+05:30 IST