Karnataka: కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ ఛాలెంజ్

ABN , First Publish Date - 2023-05-27T10:50:05+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ కొత్త సవాలు విసిరారు.కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధిస్తామని చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించడంతో నళిన్ కుమార్ కటీల్ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు..

Karnataka: కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ ఛాలెంజ్
Karnataka BJP chief Nalin Kumar Kateel

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ కొత్త సవాలు విసిరారు.కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధిస్తామని చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించడంతో నళిన్ కుమార్ కటీల్ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.(challenge)బజరంగ్‌దళ్‌ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నళిన్‌ కటీల్‌ వ్యాఖ్యానించారు.(Karnataka BJP chief Nalin Kumar Kateel) ‘ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ అని, ఆయన కేంద్ర స్థానంలో ఉన్నారు. మేమంతా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులం. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నించాయి. దానిలో విజయం సాధించలేకపోయింది’’ అని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అన్నారు.

ఇది కూడా చదవండి: Indore: ముస్లిం అమ్మాయి, హిందూ యువకుడు కలిసి హోటల్‌కు డిన్నర్‌కు వచ్చారు...ఆపై ఏం జరిగిందంటే...

ప్రియాంక్ ఖర్గే దేశ చరిత్ర గురించి తెలుసుకోవడం మంచిదని, ఆయన నాలుకను అదుపులో ఉంచుకోవాలని నళిన్ కుమార్ కటీల్ అన్నారు.‘‘నైతిక పోలీసింగ్‌కు పాల్పడే సంస్థలను నిషేధించడానికి మేము వెనుకాడం. అది ఆర్‌ఎస్‌ఎస్ లేదా బజరంగ్ దళ్ లేదా మరేదైనా మతతత్వ సంస్థ కావచ్చు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన కాంగ్రెస్ శాసనసభ్యుడు ప్రియాంక్ ఖర్గే అన్నారు.రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పాఠశాల పాఠ్యపుస్తకాల సవరణ, మత మార్పిడి నిరోధక చట్టాల వంటి గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉత్తర్వులు, చట్టాలను కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించిన తర్వాత సవరించడం లేదా ఉపసంహరించుకోవడం కూడా జరుగుతుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

Updated Date - 2023-05-27T10:50:05+05:30 IST