Karnataka : ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో అంత డబ్బా!?

ABN , First Publish Date - 2023-03-03T12:26:07+05:30 IST

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప (Karnataka BJP MLA Madal Virupakshappa) తనయుడు ప్రశాంత్ మదల్

Karnataka : ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో అంత డబ్బా!?
Karnataka BJP MLA Residence

బెంగళూరు : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప (Karnataka BJP MLA Madal Virupakshappa) తనయుడు ప్రశాంత్ మదల్ (Prashanth Madal)ను శుక్రవారం లోకాయుక్త అధికారులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.40 లక్షలు లంచం పుచ్చుకుంటుండగా ఆయన దొరికిపోయారు. దీంతో విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మైసూర్ శాండల్ సబ్బులు ఈ కంపెనీలోనే తయారవుతాయి.

లోకాయుక్త అధికారులు (Lokayukta officials) శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లు ఓ వ్యక్తి గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. వెంటనే విరూపాక్షప్ప, ప్రశాంత్‌ల ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రశాంత్ రూ.40 లక్షలు ముడుపులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో రూ.1.7 కోట్లు నగదు పట్టుబడింది. ఆయన తన తండ్రి విరూపాక్షప్ప తరపున లంచాలు పుచ్చుకుంటున్నట్లు లోకాయుక్త అనుమానిస్తోంది. విరూపాక్షప్ప నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.6 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు.

లోకాయుక్త ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించేందుకు విరూపాక్షప్పను కూడా పిలిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

Election Commission: ఒక్క ఓటుకు రూ.5వేలు వెల కడుతున్న ఈరోజుల్లో ఈ పెద్దాయన ఎందుకు గుర్తొస్తున్నాడంటే..

Supreme Court: బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు

Updated Date - 2023-03-03T12:26:07+05:30 IST