Karnataka Government: ఎలోన్ మస్క్‌ను ఆహ్వానించిన కర్ణాటక ప్రభుత్వం..

ABN , First Publish Date - 2023-06-23T19:37:32+05:30 IST

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్‌కు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) ఆహ్వానం పంపించింది.

Karnataka Government: ఎలోన్ మస్క్‌ను ఆహ్వానించిన కర్ణాటక ప్రభుత్వం..

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్‌కు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) ఆహ్వానం పంపించింది. రాష్ట్రంలో వ్యాపారాలను స్థాపించాలని మస్క్‌ను కోరింది. పెట్టుబడులకు కర్ణాటక "ఆదర్శ గమ్యస్థానం" అని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) టెస్లా, ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్‌తో (Elon Musk) సమావేశమై పెట్టుబడుల కోసం భారతదేశంలో ఉన్న అవకాశాలను అన్వేషించమని ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కారు ట్వీట్ చేయడం విశేషం. ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా కర్ణాటక రాష్ట్రం ఉందని, టెస్లా, స్టార్‌లింక్‌తో సహా ఎలోన్ మస్క్ యొక్క ఇతర వెంచర్‌లకు అవసరమైన సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉందని మంత్రి పాటిల్ తెలిపారు. రాబోయే దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సాంకేతికత మరియు తయారీ 5.0పై కర్ణాటక సర్కారు దృష్టి సారించిందని పాటిల్ చెప్పారు.

Updated Date - 2023-06-23T19:38:19+05:30 IST