Karnataka: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై.. ఆగని నిరసనలు
ABN , First Publish Date - 2023-09-22T11:45:36+05:30 IST
తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Former Chief Minister Chandrababu Naidu) అక్రమ
- సిరుగుప్పలో భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన అభిమానులు
బళ్లారి/ సిరుగుప్ప(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Former Chief Minister Chandrababu Naidu) అక్రమ అరెస్టు పై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలో గురువారం చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ప్రజాసంఘాలు, మహిళలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ముందుగా సిరుగుప్ప పట్టణంలోని హైస్కూల్ వద్దకు చేరుకున్న అభిమానులు అక్కడ సభ నిర్వహించి గాంధీ సర్కిల్ వరకూ ర్యాలీగా వెల్లి మహత్మాగాంధీకి పుష్పమాల వేశారు. నిరసనకు మద్దతుగా హాజరైన కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు కోట్ల సుజాతమ్మ, కొల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక సైకో అని అతని రాక్షస పాలనకు ప్రజలు నలిగిపోతున్నారన్నారు. అక్కడి అక్రమాలు, బెదరింపులు, దౌర్యన్యాలకు తాళలూక జనం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారన్నారు. అక్రమ కేసులు బనా యించినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. నిత్యం ఏపీ అభివృద్ధి గురించి ఆలోచించే చంద్రబాబు ఏ తప్పు చేయలేదన్నారు.
కర్ణాటకలో చంద్రబాబుపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలన్నారు. కార్యక్రమంలో కమ్మసంఘం తాలూకా అధ్యక్షుడు జాలాది రాధాకృష్ణ, మాజీ అధ్యక్షడు కోనేరు గోపాల్ కృష్ణ, ఎం ప్రసాద్‌రావు, గౌరవఅధ్యక్షులు పొల్లి శ్రీనివాసులు, వైస్‌ప్రెసెడెంట్ తాతినేని ప్రసాద్, సెక్రెటి పోతుగుంట సత్యనారాయణ, జాయిట్ సెక్రెటరీ ఎం. ప్రసాద్‌రావు, యార్లగడ్డ సత్యనారాయణ. బళ్లారి ఎంఆర్‌ఆర్ ప్రసాద్, మేక శ్రీనివాసరావు, ఎన్ మురళీ, పొట్టిపాటి చౌదరి, రమే్‌షబాబు, కిరణ్‌కుమార్, తదితరులు, జనసేన, నందమూరు, బి.సీలు, దేవీనగర్ క్యాంపు, శేషాద్రి నగర్ క్యాంపు, నందీపురం క్యాంపు, శ్రీనగర్‌క్యాంపు, ముద్దట్టనూరు క్యాంపు, పట్టన ప్రముఖులు, ఉసేన్‌సాబ్, బసవరాజప్ప, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, టీడీపీ అభిమాలు, కార్యకర్తలు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు, మహిళలు ఇలా అన్ని వర్గాలూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.