Rajasthan Row: గెహ్లాట్, పైలట్‌తో ఖర్గే సమావేశం, సయోధ్య యత్నాలు షురూ..!

ABN , First Publish Date - 2023-05-29T14:56:45+05:30 IST

కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్‌ మధ్య విభేదాలను ఇటీవల సమర్ధవంతంగా పరిష్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన విభేదాల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయనతో విభేదిస్తున్న సచిన్ పైలట్‌ తో సోమవారంనాడు న్యూఢిల్లీలో విడివిడిగా సమావేశమవుతున్నారు.

Rajasthan Row: గెహ్లాట్, పైలట్‌తో ఖర్గే సమావేశం, సయోధ్య యత్నాలు షురూ..!

న్యూఢిల్లీ: కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్‌ మధ్య విభేదాలను ఇటీవల సమర్ధవంతంగా పరిష్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఇప్పుడు రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్‌‌లో తలెత్తిన విభేదాల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఆయనతో విభేదిస్తున్న సచిన్ పైలట్‌ (Sachin Pilot)తో సోమవారంనాడు న్యూఢిల్లీలో విడివిడిగా సమావేశమవుతున్నారు.

పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే..

గెహ్లాట్, పైలట్‌తో తాను సమావేశమవుతుండటాన్ని ఖర్గే ధ్రువీకరించారు. ఇద్దరితో మాట్లాడతానని, పార్టీకి ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

వరుస పరిణామలు...

1.రాజస్థాన్‌లో గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఇచ్చిన హామీని గెహ్లాట్ సర్కార్ ఆమాట నిలబెట్టుకోలేదని, వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని పైలట్ గత కొంతకాలంలో డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల ఒకరోజు నిరాహార దీక్షతో పాటు ఐదు రోజుల పాదయాత్ర నిర్వహించారు. తాను చేసిన మూడు డిమాండ్లను నెరవేర్చాలంటూ ఈనెలాఖరుకు వరకూ ఆయన గడువు పెట్టారు.

2.వసుంధరా రాజే హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలనేది పైలట్ డిమాండ్లలో ఒకటిగా ఉంది.

3. గెహ్లాట్ కార్యాలయం ఆయన న్యూఢిల్లీ పర్యటనను ధ్రువీకరించింది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్ హౌస్‌కు గెహ్లాట్ శంకుస్థాపన చేయనున్నారు.

4.మే 26న రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కావాలని పార్టీ నిర్ణయించింది. అయితే, ఆ తరువాత ఆ కార్యక్రమం వాయిదా పడింది.

5.ఈ ఏడాది చివర్లో కీలకమైన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్, పైలట్‌ను ఒకే వేదికపైకి తెచ్చేందుకు పార్టీ అధిష్ఠానం వారిద్దరితో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

6. ఎగ్జా్మ్ పేపర్ లీక్ కారణంగా బాధితులైన అభ్యర్థులకు పరిహారం ఇవ్వాలంటూ సచిన్ పైలట్ చేసిన డిమాండ్‌పై గెహ్లాట్ గురువారం మండిపడ్డారు.

7.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎలాంటి అంశాలు లేనందునే పేపర్ లీక్ అంశం గురించి విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు గెహ్లాట్ తెలిపారు.

Updated Date - 2023-05-29T14:56:45+05:30 IST