Karnataka: మతమార్పిడి వ్యతిరేక చట్టంపై కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2023-06-15T19:00:42+05:30 IST

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం( గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటినీ సమీక్షించి అవసరమైతే రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.

Karnataka: మతమార్పిడి వ్యతిరేక చట్టంపై కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం..

బెంగళూరు: కర్ణాటక(Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో(Cabinet Meeting) కీలక నిర్ణయాలు తీసుకుంది. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని(Religious Conversion) రద్దు చేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటినీ సమీక్షించి అవసరమైతే రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. పాఠశాల స్థాయి హిస్టరీ సిలబస్‌తో పాటు వ్యవసాయ మార్కెట్‌లపై చట్టం కూడా మార్పులకు సిద్ధరామయ్య కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు.

గతేడాది మేలో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసింది. సెప్టెంబర్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మైనార్టీలను వేధించే సాధనమే మతమార్పిడి వ్యతిరేక చట్టమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వాదించాయి. ఈ చట్టాన్ని సిద్ధరామయ్య బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘మన చట్ట ప్రోత్సహాల ద్వారా బలవంతపు మతమార్పిడిని ఆపగలదు.. అలాంటప్పుడు కొత్త చట్టం అవసరమేంటీ? మైనార్టీలను బెదిరించడం, వేధించడం కోసమే ఈ చట్టం’’ అని సిద్ధరామయ్య అన్నారు. ఈ విషయం కోర్టు దాకా వెళ్లింది. మతస్వేచ్ఛను ఉల్లంఘించడమే కొత్త చట్టం అని క్రైస్తవ సంస్థలు వాదించాయి.

మరోవైపు బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన వీడీ సావర్కర్, కేబీ హెడ్గేవార్‌ల అధ్యాయాలను పాఠశాల చరిత్ర పుస్తకాల నుంచి తొలగించాలని కేబినెట్ నిర్ణయించిందని పాటిల్ చెప్పారు. గతేడాది పాఠశాల విద్య సెలబస్‌లో ఆ రెండు అధ్యాయాలు జోడించబడ్డాయి. దానితో పాటు పాఠశాల సిలబస్‌లో బీజేపీ ప్రభుత్వం చేసిన అన్ని మార్పులను కూడా తిప్పికొట్టారు. పాఠశాలలు, కళాశాలల్లో శ్లోకంతోపాటు రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని మంత్రివర్గం నిర్ణయించిందని పాటిల్ చెప్పారు.

బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్లు కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే, వాటిని సరిదిద్దుతామని తెలిపింది.

Updated Date - 2023-06-15T19:23:39+05:30 IST