Toilet Video Scandal: సీఎంను కించపరచే పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్టు

ABN , First Publish Date - 2023-07-28T17:19:30+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కించపరచేలా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్త ఒకరిని శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఉడిపి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను శకుంతల అనే బీజేపీ కార్యకర్త షేర్ చేస్తూ, దానికి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు జోడించారు.

Toilet Video Scandal: సీఎంను కించపరచే పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్టు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కించపరచేలా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్త ఒకరిని శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఉడిపి (Udipi) కేసును రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను శకుంతల అనే బీజేపీ కార్యకర్త షేర్ చేస్తూ, దానికి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఆమె జోడించారు. ఇదే సిద్ధరామయ్య (CM Siddaramayyaiah) కోడలికో, భార్యకో జరిగితే మీరు ఇలానే అంటారా? అని ఆమె ప్రశ్నించారు. ట్విట్టర్‌తో పాటు ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ పెట్టారు. దీనిపై బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.


ఉడిపి కేసు..

ఉడిపిలోని ఒక ప్రైవేటు వృతివిద్యా శిక్షాణ కాలేజీ మహిళా వాష్‌రూప్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ప్రచారం జరగడం గతవారం సంచలనమైంది. టాయిలెట్‌లో ఒక మొబైల్‌ ఫోను ఉన్న విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి ఒక విద్యార్థి తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం ముగ్గురిని గత ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ నిరసనలకు దిగగా, ఇది చాలా చిన్న విషయమని, దీనిని వేరే కోణంలో చూడరాదని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. మిత్రుల మధ్య జరిగిన ఓ ఘటన ఇందుకు కారణమని, దీనికి రాజకీయ రంగు పులమరాదని చెప్పారు.

Updated Date - 2023-07-28T17:19:30+05:30 IST