Karunanidhi: ‘తొమ్మిది’లో కలైంజర్‌ జీవిత చరిత్ర

ABN , First Publish Date - 2023-04-21T12:33:07+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ కలైంజర్‌ కరుణానిధి(Karunanidhi) జీవిత చరిత్ర ఒక

Karunanidhi: ‘తొమ్మిది’లో కలైంజర్‌ జీవిత చరిత్ర

అడయార్(చెన్నై): మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ కలైంజర్‌ కరుణానిధి(Karunanidhi) జీవిత చరిత్ర ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్‌ మహేష్‌(Anbil Mahesh) ప్రకటించారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదో తరగతిలో ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా అన్నాడీఎంకే సభ్యుడు, మాజీ మంత్రి విజయభాస్కర్‌ మాట్లాడుతూ.. విరాళిమలై నియోజకవర్గంలోని అన్నవాసల్‌ పట్టణ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ మహిళా హయ్యర్‌ సెకండరీ పాఠశాలకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి అన్బిల్‌ మహేష్‌ సమాధానమిస్తూ.. ‘హిందీ భాషకు వ్యతిరేకంగా తన 13వ యేటనే ఉద్యమ పోరు సాగించి, తన 86వ ఏట తమిళ భాషకు ప్రాచీన భాషా హోదా కల్పించిన కలైంజర్‌ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన జీవితం, పోరాటం, ఉద్యమస్ఫూర్తి తదితర అంశాలతో కూడిన పాఠ్యాంశాన్ని కొత్త విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అదే సమయంలో అన్నవాసల్‌లోని బాలికల ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలకు ప్రభుత్వం తరపున స్థలం కేటాయించడంలో న్యాయ సమస్య నెలకొనివుందన్నారు. అందువల్ల స్థానిక రెవెన్యూ శాఖ తరపున స్థల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ స్థల ఎంపిక పూర్తికాగానే నాబార్డు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ అన్బళగన్‌ పాఠశాల అభివృద్ధి పథకం కింద నిధులు కేటాయించి ఆ పాఠశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని మంత్రి అన్బిల్‌ మహేష్‌ సభాముఖంగా సమాధానమిచ్చారు.

ఇదికూడా చదవండి: అయ్యో దేవుడా.. ఆయన కూడా ఓ స్టార్‌ క్యాంపైనరా!

Updated Date - 2023-04-21T12:33:07+05:30 IST