Kaveri waters: మేట్టూరు డ్యాంకు చేరిన కావేరి జలాలు

ABN , First Publish Date - 2023-07-26T09:48:02+05:30 IST

కర్ణాటక డ్యాం నుంచి విడుదల చేసిన కావేరి జలాలు(Kaveri waters) మంగళవారం సాయంత్రం మేట్టూరు డ్యాం(Mettur Dam)కు చేరుకున్నాయి.

Kaveri waters: మేట్టూరు డ్యాంకు చేరిన కావేరి జలాలు

- కర్ణాటక నుంచి 17,688 క్యూసెక్కుల విడుదల

పెరంబూర్‌(చెన్నై): కర్ణాటక డ్యాం నుంచి విడుదల చేసిన కావేరి జలాలు(Kaveri waters) మంగళవారం సాయంత్రం మేట్టూరు డ్యాం(Mettur Dam)కు చేరుకున్నాయి. అదే సమయంలో కర్ణాటక డ్యాంల్లో నీటిమట్టాలు పెరుగుతుండడంతో కావేరి నదిలోకి విడుదల చేస్తున్న నీటిని కూడా పెంచారు. ఆ ప్రకారం, సోమవారం 13,983 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా, మంగళవారం 17,688 క్యూసెక్కులకు పెరిగింది. కేరళ, కావేరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని కృష్ణరాజసాగర్‌, కబిని జలాశయాలు పూర్తిస్థాయికి చేరువయ్యాయి. దీంతో డ్యాంల భద్రత దృష్ట్యా కృష్ణరాజసాగర్‌ డ్యాం నుంచి 2,688 క్యూసెక్కులు, కబిని డ్యాం నుంచి 15 వేల క్యూసెక్కులు అని మొత్తం 17,688 క్యూసెక్కులను కావేరి నదిలోకి విడుదల చేస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం ఈ డ్యాంల నుంచి తొలుత విడుదల చేసిన నీరు మేట్టూరు డ్యాంకు చేరుకుంది. ప్రస్తుతం మేట్టూరు డ్యాంలో 66.86 అడుగులు (పూర్తి సామర్థ్యం 120 అడుగులు) ఉండగా, డెల్టా జిల్లాల సాగుకు 10 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-26T09:48:02+05:30 IST