Kejriwal meets Uddahav: కేజ్రీవాల్‌కు భరోసా ఇచ్చిన ఉద్ధవ్ థాకరే
ABN , First Publish Date - 2023-05-24T17:35:59+05:30 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదలీలపై రాష్ట్రానికి అధికారులు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్రం ఆర్డినెన్స్ తేవడంపై మండిపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇతర పార్టీల మద్దతు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసంలో బుధవారంనాడు కలుసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదలీలపై రాష్ట్రానికి అధికారులు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్రం ఆర్డినెన్స్ తేవడంపై మండిపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇతర పార్టీల మద్దతు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన యూబీటీ (Shivasena-UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ను ఆయన నివాసంలో బుధవారంనాడు కలుసుకున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్, ఆప్ ఆద్మీపార్టీ రాజ్యసభ్య సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రి అతిషి ఉన్నారు.
సమావేశానంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, పార్లమెంటులో తమకు మద్దతుగా నిలుస్తామని ఉద్ధవ్ థాకరే వాగ్దానం చేశారని చెప్పారు. ఈ బిల్లు (ఆర్డినెన్స్) పార్లమెంటు ఆమోదం పొందని పక్షంలో 2024లో బీజేప మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని అన్నారు. ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, దేశం,ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అంతా ఏకతాటిపై నిలుస్తామన్నారు. నిజానికి తమను విపక్ష పార్టీలుగా పిలవడం సరికాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నే కేంద్రాన్నే అపోజిషన్‌గా పిలవాలని అన్నారు.
కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరకేంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కేజ్రీవాల్ ఇందులో భాగంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను కూడా కలుసుకోనున్నారు. దీనికి ముందు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం కోల్‌కతాలో మంగళవారంనాడు ఆయన కలుసుకున్నారు.