Pinarayi Vijayan: కేరళ పేరు త్వరలో మార్పు.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

ABN , First Publish Date - 2023-08-09T19:55:55+05:30 IST

కేరళ రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళంగా మార్పు సంతరించుకోంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Pinarayi Vijayan: కేరళ పేరు త్వరలో మార్పు.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తిరువనంతపురం: కేరళ (Kerala) రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళం (Keralam)గా మార్పు సంతరించుకోనుంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) స్వయంగా ఈ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ ఎలాంటి సవరణలు సూచించకుండా తమ ఆమోదం తెలిపింది. దీంతో పేరు మార్పు తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించినట్టు స్పీకర్ ఏఎన్ షంసీర్ ప్రకటించారు. తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి వెంటనే పంపుతున్నట్టు చెప్పారు.


సభలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మలయాళంలో కేరళంగా పిలుస్తారని, కానీ ఇతర భాషల్లో ఇప్పటికీ కేరళ అనే పిలుస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద కేరళ పేరును కేరళంగా సవరణ చేసి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ కేరళంగా పేరు మార్పు చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా కోరుతున్నట్టు వివరించారు.

Updated Date - 2023-08-09T20:24:46+05:30 IST