Khushboo: సీఎంకు ఖుష్బూ ప్రశ్నలు.. అవేంటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-16T11:50:42+05:30 IST

మాతృభాష తమిళాన్ని కాపాడుదామంటూ పదే పదే ప్రకటనలిస్తూ తమిళ భాష సంరక్షకుడిని తానేనంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి

Khushboo: సీఎంకు ఖుష్బూ ప్రశ్నలు.. అవేంటో తెలిస్తే...

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాతృభాష తమిళాన్ని కాపాడుదామంటూ పదే పదే ప్రకటనలిస్తూ తమిళ భాష సంరక్షకుడిని తానేనంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)... ప్లస్‌-2 పరీక్షల్లో 50వేల మంది విద్యార్థులు హాజరుకాకపోవడంపై ఏం సమాధానం చెబుతారని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ(BJP leader Khushboo) ప్రశ్నించారు. గతేడాది జరిగిన పరీక్షల్లో నాలుగు శాతం మంది గైర్హాజరయ్యారని, ఆ శాతం ఇప్పుడు ఆరుకు పెరిగిందన్నారు. ప్రధాని మోదీలా పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సలహాలు చెప్పారని, చివరకు వాటిని పట్టించుకోకుండా తమిళ పరీక్షకు 50వేలమంది విద్యార్థులు దూరమయ్యారని తెలిపారు. మోదీలా సలహాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదని, విద్యాశాఖలో ఉన్న లోపాలను చక్కదిద్దటంపై స్టాలిన్‌ దృష్టిపెట్టాలని ఆమె కోరారు.

Updated Date - 2023-03-16T11:50:42+05:30 IST