Madurai to Gujarat: మదురై టూ గుజరాత్‌.. వయా రేణిగుంట, కాచిగూడ

ABN , First Publish Date - 2023-04-14T10:51:34+05:30 IST

మధురై నుంచి గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక రైళ్లను నడునుతున్నారు.

Madurai to Gujarat: మదురై టూ గుజరాత్‌.. వయా రేణిగుంట, కాచిగూడ

ఐసిఎఫ్‌(చెన్నై): ‘సౌరాష్ట్ర తమిళ్‌ సంగమం’ కార్యక్రమానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మదురై నుంచి గుజరాత్‌ వేరావల్‌ రైల్వేస్టేషన్‌(Madurai to Gujarat Veraval Railway Station)కు శుక్రవారం నుంచి ప్రత్యేక ఛార్జీ రైళ్లను దక్షిణ రైల్వే నడుపనుంది. ఈ రైలు మదురై నుంచి సాయంత్రం 5.40 గంటలకు బయల్దేరి నాలుగవ రోజు ఉదయం 7.30 గంటలకు వేరావల్‌ చేరుకుంటుంది. ఈ నెల 15 నుంచి 23వ తేది వరకు, మరో రైలు మదురై నుంచి ప్రతిరోజు సాయంత్రం 5.40 గంటలకు బయల్దేరి నాలుగవ రోజు ఉదయం 9 గంటలకు వేరావల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు దిండుగల్‌, విల్లుపురం, ఎగ్మూర్‌, రేణిగుంట, కాచిగూడ(Renigunta, Kachiguda), వడోదర, అహమ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ మీదుగా వెళ్లనున్నాయి.

Updated Date - 2023-04-14T10:51:34+05:30 IST