Train accident: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. ఏడు ప్యాసింజర్ రైళ్లకు అంతరాయం
ABN , First Publish Date - 2023-12-10T21:27:31+05:30 IST
మహారాష్ట్రలోని కసారా రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. కసారా స్టేషన్-టీజీఆర్3 డౌన్ లైన్ సెక్షన్ మధ్య ఆదివారం సాయంత్రం 6.31 గంటలకు ఈ ఘటన జరిగింది. ఏడు బోగాలు పట్టాలు తప్పినట్టు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
థానే: మహారాష్ట్ర (Maharashtra)లోని కసారా (Kasara) రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. కసారా స్టేషన్-టీజీఆర్3 డౌన్ లైన్ సెక్షన్ మధ్య ఆదివారం సాయంత్రం 6.31 గంటలకు ఈ ఘటన జరిగింది. ఏడు బోగాలు పట్టాలు తప్పినట్టు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ఏడు దూర ప్రయాణ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.
సెంట్రల్ రైల్వే అధికారుల సమాచారం ప్రకారం, గూడ్సు పట్టాలు తప్పడంతో కసారా నుంచి ఇగత్‌పురి డైన్ లైన్ సెక్షన్, మిడిల్ లైన్ సెక్షన్ల మధ్య మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. అయితే, ఇగత్‌పురి, కాసరా అప్ లైన్ ట్రాఫిక్‌పై ఎలాంటి ప్రభావం లేదు. సబర్బన్ లోకల్ రైళ్లపై కూడా ఎలాంటి ప్రభావం పడలేదు. 12261 ముంబై సీఎస్ఎంటీ-హౌరా ఎక్స్‌ప్రెస్, 11401 సీఎస్ఎంటీ-అదిలాబాద్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు తప్పిన బోగాలను తరలించేందుకు కల్యాణ్ స్టేషన్ రోడ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రయిన్‌ను ప్రమాద స్థలికి రప్పించారు.