Bharat Jodo Yatra: యాత్రలో భద్రతా ఉల్లంఘన...ఓ వ్యక్తి రాహుల్‌ను హగ్ చేసుకునే యత్నం

ABN , First Publish Date - 2023-01-17T11:25:59+05:30 IST

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ఓ వ్యక్తి రాహుల్ గాంధీ భద్రతను ఉల్లంఘించడానికి...

Bharat Jodo Yatra: యాత్రలో భద్రతా ఉల్లంఘన...ఓ వ్యక్తి రాహుల్‌ను హగ్ చేసుకునే యత్నం
Man breaches security

హోషియార్‌పూర్ (పంజాబ్): పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ఓ వ్యక్తి రాహుల్ గాంధీ భద్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడు.(Man breaches security) మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో ఒక వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హగ్ చేసుకునేందుకు యత్నించాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పసుపు రంగు జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్ గాంధీ వైపు వచ్చి అతన్ని కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.రాహుల్ పక్కన నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని తోసేశారు.

రాహుల్ గాంధీకి జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. అంతర్గత భద్రతా వలయాన్ని ఛేదిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు రావడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం హోషియార్‌పూర్‌లోని తండాలో భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో పాటుగా యాత్రలో పాల్గొన్నారు.తన యాత్రకు విశేష స్పందన లభిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలపై రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-01-17T11:26:57+05:30 IST