Modi Vs Sisodia : మోదీ దురహంకారి : సిసోడియా

ABN , First Publish Date - 2023-05-23T17:18:21+05:30 IST

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Modi Vs Sisodia : మోదీ దురహంకారి : సిసోడియా
Manish Sisodia

న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికారుల బదిలీల అధికారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఘాటుగా విమర్శించారు. మోదీ అహంకారిగా మారిపోయారని దుయ్యబట్టారు.

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసు (Delhi excise policy case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగిసిపోవడంతో మంగళవారం ఆయనను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ ఎంత దురహంకారిగా మారిపోయారంటే, ఆయన ప్రజాస్వామ్యాన్ని అనుసరించరు’’ అని ఆరోపించారు.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే అధికారులపై నియంత్రణాధికారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఓ వారం తర్వాత మే 19న కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని అధికారులపై నియంత్రణాధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్డినెన్స్ కట్టబెడుతోంది. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునేటపుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పెద్ద పీట వేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశాల్లో సొంత విచక్షణతో వ్యవహరించవచ్చునని చెప్పింది. నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అధారిటీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది.

ఈ ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ పార్టీ నేతలు అనేకమంది కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇది నిజాయితీలేని చర్య అని దుయ్యబట్టారు.

ఇదిలావుండగా, ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఆయన చదువుకోవడం కోసం కుర్చీ, బల్ల ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారని, దీనిని పరిశీలించాలని జైల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఆయన తన న్యాయవాదితో న్యాయపరమైన అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Sitting Long Hours: గంటల తరబడి అదే పనిగా కూర్చోవడం స్మోకింగ్ కంటే డేంజరట.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.

PM Modi: ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ శుభవార్త

Updated Date - 2023-05-23T17:20:55+05:30 IST