Share News

Minister: ఏం భయంలేదు.. ఆ మహిళలందరికి మళ్లీ అవకాశం ఇస్తాం..

ABN , First Publish Date - 2023-10-27T11:04:32+05:30 IST

కలైంజర్‌ మహిళా సాధికార నగదు పథకం కింద అర్హులైన మహిళలు మరోమారు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని

Minister: ఏం భయంలేదు.. ఆ మహిళలందరికి మళ్లీ అవకాశం ఇస్తాం..

అడయార్‌(చెన్నై): కలైంజర్‌ మహిళా సాధికార నగదు పథకం కింద అర్హులైన మహిళలు మరోమారు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు. ఆయన తేని జిల్లాలోని సాత్తూరులో పర్యటించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో సాత్తూరు తాహసీల్దారు కార్యాలయంలో నగదు పథకం తిరస్కరణకు గురైన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అలాగే, వారి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి గల కారణాలను స్థానిక రెవెన్యూ అధికారులు మంత్రికి వివరించారు. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరికి నాలుగు చక్రాల వాహనం ఉందని, మరో మహిళకు పొలం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... ఈ మహిళా సాధికార నగదు పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకున్న 11.56 లక్షల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అర్హులైన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పి స్తామన్నారు. రాజ్‌భవన్‌ వద్ద బాంబు పేలిన ఘటనను తాను రాజకీయం చేయాలని భావించడం లేదన్నారు. పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, సాత్తూరు రామచంద్రన్‌, జిల్లా కలెక్టర్‌ జయశీలన్‌, స్థానిక డీఎంకే నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత విరుదు నగర్‌లోని రామ్మూర్తి మైదానంలో జరిగిన పార్టీ యువజన విభాగ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

nani1.jpg

నీట్‌కు వ్యతిరేకంగా 8లక్షల సంతకాల సేకరణ

నీట్‌కు వ్యతిరేంగా డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతకాల ఉద్యమంలో ఇప్పటివరకూ 8లక్షల మంది సంతకాలు చేసినట్లు ఆ విభాగం నాయకులు ప్రకటించారు. నీట్‌ పరీక్షలకు వ్యతిరేకంగా సేకరించే 50 లక్షల సంతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించనున్నట్లు మంత్రి ఉదయనిధి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని జిల్లాలో డీఎంకే స్థానిక నాయకులు సంతకాల సేకరణలో ముమ్మరంగా పాలుపంచుకుంటున్నారు.

Updated Date - 2023-10-27T11:04:32+05:30 IST