Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ‘నీట్‌’ ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2023-08-31T09:16:53+05:30 IST

‘నీట్‌’ భయంతో, వైద్యులు కాలేమన్న బాధతో విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని

Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ‘నీట్‌’ ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలి

వేళచ్చేరి(చెన్నై): ‘నీట్‌’ భయంతో, వైద్యులు కాలేమన్న బాధతో విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) పేర్కొన్నారు. కడలూరు జిల్లా దిట్టకుడి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన పార్టీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.... ‘నీట్‌’ మినహాయింపు కోరుతూ సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చేపట్టిన న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో ‘రమణ’ చిత్రంలో ఉన్నట్లు, మృతి చెందిన 88 వేల మంది పేర్లతో కోట్లాది రూపాయల అవినీతి చోటుచేసుకుందని మంత్రి ఉదయనిధి ఆరోపించారు.

Updated Date - 2023-08-31T09:16:55+05:30 IST