Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు... నీట్ వ్యతిరేక ఉద్యమంలో అన్నాడీఎంకే పాల్గొనలేదు
ABN , First Publish Date - 2023-10-25T10:41:44+05:30 IST
నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యమంలో అన్నాడీఎంకే పాల్గొనబోదని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమంటే
ప్యారీస్(చెన్నై): నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యమంలో అన్నాడీఎంకే పాల్గొనబోదని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమంటే ఆ పార్టీ నేతలకు భయమని రాష్ట్ర యువజన సంక్షేమశాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) విమర్శించారు. మంగళవారం ఆయన చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ.. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ ఉద్యమాన్ని డీఎంకే(DMK) చేపట్టిందని గుర్తు చేశారు. కానీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) దీనిపై తీవ్ర విమర్శలు చేయడం గర్హనీయమన్నారు. నీట్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 22 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారన్నారు. అయినా అన్నాడీఎంకే నేతలకు ఇవేమీ పట్టడం లేదన్నారు. ఆ పార్టీ నేతలపై వున్న కేసుల కారణంగా వారు నీట్‌ను వ్యతిరేకించలేకపోతున్నారని మంత్రి విమర్శించారు.